ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కే నాగలాపురంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
ఎమ్మిగనూరు మండలం కే నాగలాపురంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులు పంపిణీ చేసి, కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.