ఆళ్లగడ్డ: ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలి యోగా ట్రైనర్ లక్ష్మీదేవి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలని యోగా ట్రైనర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు, బుధవారం ఆళ్లగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్ర సిబ్బందికి యోగ, మెడిటేషన్ ల పై అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగ చేయడం వలన మానసిక ప్రశాంతత లభించడంతోపాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను సాధన చేయాలని లక్ష్మీదేవి సూచించారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు