డోన్: ఎస్ ఐ ఆర్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించండి: డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 20, 2026 నంద్యాల జిల్లా డోన్లోని సుందర్ సింగ్ కాలనీ, 12వ సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(SIR) కార్య క్రమాన్ని ఎమ్మెల్ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు (BLO) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటరు వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు.