డోన్: బేతంచర్ల మండలంలో భూ వివాదంలో చీని చెట్లను పెరికేసిన వారిపై కేసు నమోదు : ఎస్సై రమేష్ బాబు
Dhone, Nandyal | Jun 15, 2026 బేతంచెర్ల మండలంకొలుములపల్లికి చెందిన పులగుమ్మి సుంకన్న చీని చెట్లను పీకేవేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. చీనిచెట్లను పీకి వేయడమే కాకుండా తనపై దాడి చేశారని సుంకన్న ఫిర్యాదు మేరకు గూని నాగరాజు, అతని కొడుకు వీరాంజనేయులు, అంబాపురం మద్దిలేటి, చిన్న ఆనంద్, పెద్ద ఆనంద్, మరి కొంతమందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.