ఆళ్లగడ్డ: దొర్నిపాడు సమీపంలో శిథిలావస్థకు చేరిన వంతెన, ప్రమాదకరంగా మారిన ప్రయాణం
ఆళ్లగడ్డ పట్టణము నుంచి కోవెలకుంట్ల మార్గంలో దొర్నిపాడు దాటిన తర్వాత వాగు పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది, వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు, ప్రతిరోజు ఈ మార్గంలో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి, అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మాణం చేయాలని స్థానికులు ప్రయాణికులు గురువారం కోరారు