నంద్యాల అర్బన్: తిరుపతిలో గరుడవారది ఫ్లైఓవర్ నుంచి దూకిన నంద్యాల జిల్లాకు చెందిన యువతి
Nandyal Urban, Nandyal | May 15, 2026
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ఆదిలక్ష్మి (24) శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి కరకంబాడి లీలామహల్ సర్కిల్ మార్గంలో కిందికి దూకింది. చావుబతుకుల్లో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మి తన అన్న సాములతో కలిసి తిరుపతికి వలస వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణం తెలియాల్సి ఉంది.