కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు 140 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన 140 మంది మహిళలకు మంగళవారం స్థానిక అమరావతి గ్రౌండ్ నందు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఉచితంగా అందజేసిన కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.