ఆళ్లగడ్డ: పొన్నాపురం కాల్వ వద్ద రైలు కింద పడి యువకుడు మృతి,పడగండ్ల గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించిన రైల్వే పోలీసులు
నంద్యాల జిల్లా నంద్యాల మండలం పొన్నాపురం కాలువ వద్ద రైలు కింద పడి మృతి చెందిన యువకుడిని ఆళ్లగడ్డ మండలం పడగండ్ల గ్రామానికి చెందిన కోట చిరంజీవి గా రైల్వే పోలీసులు గుర్తించారు, గత ఐదేళ్లుగా నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో ఉంటూ ఎలక్ట్రికల్ పనిచేసేవాడని ఎస్ఐ కుమారి తెలిపారు, అతని మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు