హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కైట్, స్వీట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఫెస్టివల్లో వివిధ దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు పాల్గొననుండగా, దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది దేశీయ కైట్ ప్లేయర్లు సందర్శకులను అలరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.