తిరువూరులో భారీ కొండచిలువ కలకలం
Tiruvuru, NTR | Sep 21, 2025 తిరువూరులోని వెల్లంకి ఎస్టేట్ ప్రాంతంలో సుమారు 15 అడుగుల పొడవు ఉన్న ఓ భారీ కొండచిలువ సంచరించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఆదివారం కొండచిలువను చూసిన యువకులు దానిని కెమెరాలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ వారు జగన్నాధపురం కాలనీ ప్రజలను హెచ్చరించారు. అధికారులకు సమాచారమిచ్చారు.