బనగానపల్లె: అవుకులో గుండెపోటుతో టీచర్ మృతి
నంద్యాల జిల్లా అవుకు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వనుముగాళ్ల ముఖేశ్ గుండెపోటుతో మృతిచెందారు. అవుకు ఏపీ మోడల్ స్కూలులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబసభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముఖేశ్ మృతి పట్ల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు సంతాపం తెలిపారు.