నంద్యాల అర్బన్: ఓటర్ల సవరణలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
Nandyal Urban, Nandyal | Jun 26, 2026
నంద్యాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా శుక్రవారం AERO, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పలు వార్డుల్లో పర్యటించారు. SIR ఫారాల పంపిణీ, సేకరణ పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికీ ఫారాలు అందజేసి, సకాలంలో సేకరించాలని BLOలను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోపు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు