నందికోట్కూరు: యం గణపురం గ్రామంలో, వడదెబ్బతో ఉపాధి కూలీ వడ్డే మద్దిలేటి మృతి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం యం ఘనపురం గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి ఉపాధి కూలీ వడదెబ్బతో మరణించాడు, ఉపాధి పనులకు వెళ్లిన ఆయన ఎండ తీవ్రతకు అస్వస్థకు గురయ్యారు, వాంతులు విరేచనలు అధికం కావడంతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, అధికారులు స్పందించే బాధ్యత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు