వీరబల్లి: తృటిలో తప్పిన స్కూల్ బస్సు పెను ప్రమాదం..విద్యార్థుల ప్రాణాలు కాపాడిన అదృష్టం
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది. రాయచోటి పట్టణం మసాపేటకు చెందిన శ్రీ సాయి స్కూల్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో పలువురు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణంగా అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.