నంద్యాల అర్బన్: నంద్యాల హనీఫ్ నగర్ లో డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపిన కాలనీవాసులు
Nandyal Urban, Nandyal | Jun 8, 2026
కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని నంద్యాలలోని హనీఫ్ నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లుగా నంద్యాలకు వస్తున్న మున్సిపల్ కమిషనర్లకు స్థానిక సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. ఆదివారం కురిసిన కొద్దిపాటి వర్షానికి కాలనీ అంతా జలమయంగా మారిందని, అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ కాలనీని అభివృద్ధి చేయాలని ప్రజలు సోమవారం విజ్ఞప్తి చేస్తున్నారు.