రాజేంద్రనగర్: గచ్చిబౌలిలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నిందితులు అరెస్టు
గచ్చిబౌలి ఇందిరానగర్ లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మాదాపూర్ SOT పోలీసులు పట్టుకున్నారు. గచ్చిబౌలిలో ఓ జిరాక్స్ సెంటరు కేంద్రంగా చేసుకుని పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, వే బిల్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్, మార్క్స్ మెమోలు, పాన్ సహా వివిధ నకిలీ డాక్యుమెంట్లు రూపొందిస్తున్నట్లు ACP శ్రీధర్ తెలిపారు. ప్రధాన నిందితులు మహమ్మద్ సాజీద్, గంట రాజీవ్, మరో కొందరిని అరెస్ట్ చేశారు.