నంద్యాల అర్బన్: నంద్యాల కేసు కెనాల్ ఆఫీస్ వద్ద రైతు నిరసన
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
నంద్యాల కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద గోస్పాడు మండలం ఎం.చింతకుంట్లకు చెందిన రైతు చిన్న హుస్సేనయ్య రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. తన పొలానికి వచ్చే సాగునీటి కాలువను పూడ్చి వేశారని, మండే ఎండలను సైతం లెక్కచేయకుండా న్యాయం కోసం పోరాడుతున్నానని ఆయన వాపోయారు.అధికారులు వెంటనే స్పందించి పూడ్చివేసిన కాలువను పునరుద్దరించాలని హుస్చేనయ్య డిమాండ్ చేస్తున్నారు