బనగానపల్లె: సంజామల మండలంలో తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్
నంద్యాల జిల్లా సంజామలలో ఆదివారం మధ్యాహ్నం తక్కువ ఎత్తులో హెలికాప్టర్ ప్రయాణిస్తూ ప్రజలకు కనువిందు చేసింది. అకస్మాత్తుగా గ్రామాల మీదుగా తక్కువ ఎత్తులో వెళ్తున్న హెలికాప్టర్ను చూసేందుకు స్థానికులు ఇళ్ల బయటకు వచ్చి ఆసక్తిగా వీక్షించారు. పలువురు మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.