రాజమండ్రి సిటీ: పెద్దిరెడ్డి కుటుంబం పై కక్ష సాధింపు సరికాదు : రాజమండ్రిలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ప్రతిపక్ష నాయకులపై కక్షపూరితంగా కేసులు పెడుతూ అరెస్టు చేస్తున్న సీఎం చంద్రబాబు, వారి తనయుడు లోకేష్ ఒకసారి ఇద్దరు కలసి పునరాలోచించుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. రాజమండ్రిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆకాశంలోకి ఉమ్మి వేస్తే తిరిగి తమ మీదకు వస్తుందని సత్యాన్ని ఇద్దరు గుర్తుపెట్టుకోవాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు సరికాదు అన్నారు కాకాణి.