సిమెంటు లారీ, బైక్ ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. AP నర్సాపురానికు చెందిన మణికంఠ (30) మియాఖాన్ గడ్డలో నివాసం ఉంటూ హోటల్ నడుపుతున్నాడు. పనులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్లే క్రమంలో శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ ముకుంద రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదైంది.