ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా
Ongole Urban, Prakasam | May 20, 2026
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు యజమానులు బంద్ ప్రకటించారు. ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని మెడికల్ షాపులను మూసివేసి బుధవారం కలెక్టరేట్ వద్ద తమ నిరసన తెలియజేశారు. ఆన్ లైన్ లో నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న మందుల విక్రయాలను నిలిపివేయాలని కార్పొరేట్ సంస్థల అడ్డగోలు డిస్కౌంట్ ధరలను నియంత్రించాలని.. ప్రజల ప్రాణాలతో చలగాటమాడే నకిలి మందుల విక్రయాలను అరికట్టాలని మెడికల్ షాప్ ఓనర్లు డిమాండ్ చేశారు.