పాలకుర్తి: పాలకుర్తి మండల ఉప సర్పంచ్ల ఫోరం ఎన్నిక: అధ్యక్షుడిగా గాదెపాక కిరణ్
జనగామ జిల్లా పాలకుర్తి మండల ఉప సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా గాదెపాక కిరణ్, ప్రధాన కార్యదర్శిగా లకావత్ నాగరాజు నాయక్ బాధ్యతలు చేపట్టారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఫోరం పనిచేయనుంది.