బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టిడిపిలో కీలక పదవి
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పొలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీ అధిష్ఠానం నియమించింది. బుధవారం వెలువడిన పార్టీ కీలక పదవుల్లో బనగానపల్లె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. టీడీపీలో పొలిట్ బ్యూరో కమిటీనే అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడం గమనార్హం.