అక్రమాల నిరోధానికే ఎండీయూ వాహనాల రద్దు: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు
రేషన్ సరకుల పంపిణీలో అక్రమాలు నిరోధించేందుకే కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసిందని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు అన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల వడ్డాదిలో రేషన్ షాపుల వద్ద సరకుల పంపిణీని ప్రారంభించారు. రేషన్ పంపిణీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలు నిర్ధేశిత సమయాల్లో షాపుల వద్ద ఎప్పుడైనా సరకులు తీసుకోవచ్చని పేర్కొన్నారు.