డోన్: డోన్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు
Dhone, Nandyal | Apr 5, 2026 డోన్ పట్టణంలో ఈస్టర్ పర్వదినం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకలకు భారీగా క్రైస్తవులు హాజరయ్యారు. యేసుక్రీస్తు పునరుత్పాదకశక్తిని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్టర్ మానవాళికి రక్షణ, నూతన జీవితానికి ప్రతీక అని తెలిపారు. విశ్వాసులు భక్తి పారవశ్యంలో ప్రార్థనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.