డోన్: డోన్ లో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 1, 2026 దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛను పెంపు సీఎం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం డోన్ పట్టణంలోని 12వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. సామాన్యులకు నిజమైన భరోసా ఇస్తోందని పేర్కొన్నారు.