అనంతపురం అర్బన్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని రాత్రి వేళల్లో కూడా తనిఖీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం
Anantapur Urban, Anantapur | Jul 6, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని వైద్యులకు ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న వాటిని ఎదుర్కునేలా వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర వైద్య విభాగంలో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు.