డోన్: డోన్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన డిఎస్పి శ్రీనివాసులు
Dhone, Nandyal | Jul 1, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ను డీఎస్పీ శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టి కొద్దిసేపు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.