కోనసీమ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కపిలేశ్వరపురం మండలంలో అత్యధికంగా 45.2 మి.మి వర్షపాతం నమోదు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గడచిన 24 గంటల్లో కపిలేశ్వరపురం మండలంలో అత్య ధికంగా 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. అదే సమయంలో ఉప్పలగుప్తం మండలంలో అత్యల్పంగా 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 10.8 మిల్లీమీటర్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.