నందికోట్కూరు: కుమ్మరి పేటలో తెగిపడ్డ విద్యుత్ తీగలు తప్పిన పెను ప్రమాదం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఈదురు గాలులకు ఉర్దూ పాఠశాల సమీపంలోని కుమ్మరి వీధిలో వేపమాను కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి, దీంతో మంటలు చెలరేగి తీగలు తెగిపడ్డాయి, ప్రమాదాన్ని గమనించిన కుమ్మరి వీధి మహిళా గోవిందమ్మ వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కి సమాచారం అందించారు, స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ట్రాన్స్ కో ఏ ఈ కి సమాచారం అందించడంతో విద్యుత్ సిబ్బంది వచ్చి సరఫరా నిలిపివేశారు, దీంతో పెను ప్రమాదం తప్పింది