నంద్యాల అర్బన్: మహానంది మండలంలో అగ్ని ప్రమాదం,మంటల్లో కాలిపోయిన అరటి నిమ్మతోట
Nandyal Urban, Nandyal | May 19, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన రైతు మిలిటరీ సుబ్బారెడ్డి పొలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అరటి, నిమ్మ తోటలు కాలిపోయాయి. కృష్ణనందికి వెళ్లే రహదారి పక్కన ఉన్న ఎకరం పొలంలో సాగు చేస్తున్న అరటి, నిమ్మ చెట్లతో పాటు డ్రిప్ పైపులు, వైర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.