అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో బుధవారం ఐదు నెలల నుంచి ఏడున్నర గంటల వరకు వివిధ శాఖ అధికారులతో నాయకులతోను సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ విశాఖను ఏ ఐ హబ్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దబోతున్నాడని అదేవిధంగా గూగుల్ సంస్థతో లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏ ఐ హబ్ గా గూగుల్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని గూగుల్ సంస్థ నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.