గుడిహత్నూరు: ఉర్దూ భాష అభివృద్ధికి కృషి: ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందన్
ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తానని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందన్ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న షాహిద్ అహ్మద్‌ను ఆదిలాబాద్‌లో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఉర్దూ అకాడమీ సంబంధించిన లైబ్రరీలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జహీర్, పత్తి ముజ్జు ఉన్నారు.