భీమిలి: తగరపువలస జ్యూట్ మిల్ కార్మికులు సమస్యపై లాయర్ జనార్దన్ జ్యూట్ మిల్ కార్మికులతో మీడియా సమావేశo
తగరపువలస జ్యూట్ మిల్ కార్మికులు సమస్యపై లాయర్ జనార్దన్ ఆదివారం జ్యూట్ మిల్ కార్మికులతో మీడియా సమావేశం నిర్వహించారు. తగరపువలసలో ఉన్న జ్యూట్ మిల్ యాజమాన్యం అసంబధ్దంగా 2009 జూట్ మిల్ లాక్ అవుట్ చేసి హై కోర్ట్ కి వెళ్ళింది. అక్రమ లాక్అవుట్ పై వేరు వేరు వాజ్యాల్లో 18నెలల జీతాలు 142కోట్లు చెల్లించాలని బకాయిలు చెల్లించాలని 2011లో కోర్ట్ ఆర్డర్ ఇచ్చారు. 2019లో కార్మికులకు రావలసిన 5నెలలు జీతమే అంటూ తీర్మానం చేసారు. 2020లో అక్రమ బాధితుల సంఘం మళ్లీ ఒక పిటిషన్ వేసారు. ఈ సెట్టెల్మెంట్స్ తప్పని కోర్ట్ నుండి ఆర్డర్ వస్తుందని కార్మికులకు మీడియా ముఖంగా తెలుపుతున్నట్లు తెలిపారు.