వాంకిడి: ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 9మంది పోలీస్ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు అందజేసిన జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోలీస్ శాఖలో ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 9 మంది పోలీస్ సిబ్బందిని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు కనబరిచినందుకు గాను 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 9 మంది పోలీస్ సిబ్బందిలకు ప్రశంసాపత్రం అందజేశారు. మరింతగా బాధ్యతగా విధులు నిర్వర్తించి మరిన్ని పథకాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.