అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మంగళవారం రాయచోటి రూరల్ సర్కిల్ పరిధిలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ గారు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.గ్రామాల్లో రోజూ గస్తీ నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని, రాత్రి బీట్లో మండలం అంతా కవర్ అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, కోడిపందాలు, మైనర్ డ్రైవింగ్ వంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీస