పిడుగు శబ్దానికి గుండె ఆగి ఒంగోలులో బాలుడు మృతి, గాంధీ నగర్ లో విషాద ఘటన
Ongole Urban, Prakasam | Sep 17, 2025
పిడుగు పడ్డ శబ్దానికి గుండె ఆగి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఒంగోలు నగరంలో బుధవారం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో నగరంలో కుంభవృష్టి కురిసింది. ఇదే సమయంలో గాంధీనగర్ లో ఒక ఇంటి వద్ద పిడుగు పడటంతో ఆ శబ్దానికి గుండె ఆగి చందు అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.కుటుంబ సభ్యులందరూ ఉండగానే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో వారు హతాశులయ్యారు. సమాచారం అందుకున్న విఆర్ఓ వివరాలు సేకరించారు.