ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని గ్రామాల మిరప పంట సాగు చేసిన రైతులకు మండల వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి పలు సూచనలు చేశారు. మిరప పంటలలో వివిధ రకాల దోమలు ఆకు పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటే నివారణ చర్యల గురించి వివరించారు. పలు గ్రామాలలోని మిరప పంట పొలాలను ఇప్పటికే పరిశీలించడం జరిగిందన్నారు. రైతులకు ఏ సందేహం ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు.