బనగానపల్లె: బనగానపల్లెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెయింట్ కార్మికుడు షేక్ ఫజల్ రహిమాన్కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు. జుమ్మా మసీదు కాలనీకి చెందిన అతడు మోటార్ సైకిల్ నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకున్న అతనికి ఆమె రూ.10 వేల నగదు అందించారు. బాధితుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.