ఉరవకొండ: కస్తూరిబా గాంధీ బాలికల కళాశాలలో విద్యార్థినులకు కంటి వైద్య పరీక్షలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాలలో మంగళవారం స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కంటి పరీక్షలను పీహెచ్సీ వైద్యాధికారి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కళాశాలలో ఎస్ఓ నాగరత్నబాయి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యాధికారి పాల్గొని విద్యార్థినిలకు తొలుత కంటి వైద్య చికిత్సలపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య చికిత్సల నిర్వహించి 35 మంది విద్యార్థినులకు కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమం లో సీ హె చ్ ఓ పద్మావతి, పి హెచ్ ఎన్ సరోజమ్మ, సూపర్ వైజర్ రమణ సార్, కన్యాకుమారి. ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.