కావలి: కావలిలో జీఎస్టీ సూపర్ సేవింగ్ పై ట్రాక్టర్లతో ర్యాలీ
కావలిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'సూపర్ GST సూపర్ సేవింగ్స్' కార్యక్రమంపై ట్రాక్టర్లతో బుధవారం ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలపై ఉన్న జీఎస్టీ రాయితీలు, పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.