ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రలో బేతంచెర్ల విద్యార్థిని ఘనత
Dhone, Nandyal | Apr 28, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన వినికిడి లోపం కలిగిన విద్యార్థిని నీలకంటి మధు తనూజ అరుదైన ఘనత సాధించింది. జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఆమె ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసింది.సాధారణ కూలీ కుటుంబానికి చెందిన తనూజ చిన్న వయసులోనే ఇలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని తన ప్రతిభను చాటుకుంది. ఈనెల 15న యాత్ర ప్రారంభించి 25న ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకుంది.