ఒంగోలు అర్బన్: ఒంగోలులో జరిగిన భారీ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్ కృష్ణ వెల్లడి
Ongole Urban, Prakasam | Jul 5, 2026
ఒంగోలు పట్టణంలో శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఆదివారం సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. దాదాపు 29 లక్షల రూపాయల గురించి చేస్తే బంగారం వెండి వస్తువులు దొంగలు అపహరించారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. సీసీ కెమెరాల పుటేజ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ ని దొంగలు దొంగిలించి తీసుకు వెళ్లినట్లు సీఐ తెలిపారు. విచారణలో మరిన్ని వివరాల్లో తెలుసుకొని త్వరలో పూర్తి వివరాలు చెబుతామని అన్నారు.