నగరి: చిత్తూరు జిల్లాలో తగ్గని ఉష్ణోగ్రతలు, తీవ్ర వేడికి నీటి కుంటలను బావులను ఆశ్రయిస్తున్న ప్రజలు
కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పాలసముద్రంలో నగరి పరిసర ప్రాంతాలలో చిన్నా, పెద్ద అన్న తేడ లేకుండా బావిలో సరదాగా ఈత కొట్టారు. ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి బావిలో సేద తీరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో బావుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.