ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి, బేస్తవారిపేట మండలం గంటాపురంలో మహిళా రైతు కూలీ మృతి
Ongole Urban, Prakasam | Apr 28, 2026
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం గంటాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పొలంలో పనిచేస్తూ మహిళ రైతు కూలీ శోభారాణి పిడుగుపాటుకు మృతి చెందింది. ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్న సమయంలో శోభారాణి మొబైల్ ఫోన్ లో మాట్లాడుతుండగా పిడుగు పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. తోటి మహిళా కూలీలు శోభారాణిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.