బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం, పట్టుదల సామాజిక దృక్పథం నేటి యువతకు స్ఫూర్తిదాయకం : మంత్రి పయ్యావుల కేశవ్
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
భారతదేశ మాజీ ప్రధాని, సమతావాది డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్, చర్చి ఎదురుగా ఉన్న డా. బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీ నారాయణ, అనంతపురము అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలన్నారు.