వెంకటాపురం గ్రామంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి దీపావళి పండుగను నిర్వహించుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఎమ్మెల్యే పరిటాల సునీత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి దీపావళి పండుగలు నిర్వహించుకోవడం జరిగిందని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం జీఎస్టీ ని కూడా తగ్గించడం జరిగిందని పేద ప్రజలు మరింత అభివృద్ధికి రావాలని అందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.