ఆళ్లగడ్డ: రుద్రవరం మండలంలోని పలు గ్రామాల్లో: ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది, మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండా కాచింది, సాయంత్రానికి ఆకాశం మేఘవృత్తమై చల్లని గాలులు వీచాయి, నరసాపురం సహా పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది, అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు