మధిర: మధుర మండలం మాటూరు పేట గ్రామ ఆలయంలో వేడుకగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు
మధిర మండలం మాటూరుపేట గ్రామ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అంకాలమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.