జహీరాబాద్: విద్యార్థుల పరిజ్ఞానానికి సాంకేతిక విద్య దోహదం: ఎస్సై కాశీనాథ్
విద్యార్థుల పరిజ్ఞానం పెంపొందించడానికి సాంకేతిక విద్య దోహదపడుతుందని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బుడిది పాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు గౌతమ్ కుమార్ సొంత డబ్బులతో పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు టీవీని అందించారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై కాశీనాథ్, ఎంఈఓ మానయ్య పాల్గొన్నారు. సొంత నిధులతో టీవీని సమకూర్చి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.